చైతూ వల్ల సమంతకు మళ్లీ ఆ బాధ తప్పదు.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

by Dishanational2 |
చైతూ వల్ల సమంతకు మళ్లీ ఆ బాధ తప్పదు.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల జాతకం చెబుతూ ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినవి నిజం కావడంతో చాలా మంది ఆయన చెప్పేది నమ్మేవారు. అంతే కాకుండా స్టార్ హీరోలు కూడా,ఆయన వద్దకు వెళ్లి జాతకం చూపించుకుంటున్నట్లు ఓ సారి వేణుస్వామి ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా నాగచైతన్య, సమంత పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోతారని, చెప్పడంతో ఆయన చెప్పింది నిజం కావడంతో, అందరూ వేణుస్వామిని చాలా నమ్మారు. అయితే చై, సామ్ విడిపోయిన తర్వాత నాగచైతన్య కెరీర్ బాగుంటుందని తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు, నాగచైతన్య కెరీర్ ప్లాప్స్‌తో దారుణంగా తయారైంది.కాగా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామిని ఒకరు అదే అడిగారు.

మీరు అలా చెప్పారు కానీ సమంత వెళ్లిపోయిన తర్వాత నాగచైతన్య కెరీర్ ఏమి బాలేదు.. ఇంకా దిగిపోయింది కదా అని అడిగారు. దానితో అతను నేను చెప్పింది నిజమే. సమంత వెళ్లిపోయిన తర్వాత నాగచైతన్య జీవితం బాగుంటుంది. కానీ అప్పుడే కాదు.. ఈ జనవరి నుంచి అతను జీవితం చాలా బాగుంటుంది అని.. అక్కడ నుంచి అన్నీ అతనికి హిట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో నాగచైతన్య కెరీర్ ఎదుగుతే, సమంతను చాలా ట్రోల్స్ చేస్తారని, ఆవి షయంలో మళ్లీ సమంత బాధపడాల్సి వస్తుంది అంటున్నారు, నెటిజన్స్.

Read more: మరో ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. హైదాబాద్‌లోనే ఎవరి వద్ద లేదంటా..?

Next Story