- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ యంగ్ హీరో గ్యాంబ్లర్స్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeeth Shobhan) పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్(Sangeeth Shobhan) పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్(Mad Square) వంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించి వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంబ్లర్స్’(Gamblers). ప్రశాంతి చారులింగా(Prasanthi Charulinga) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాకింగ్ రాకేష్, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్ర శివ, శివా రెడ్డి, పృథ్విరాజ్ బన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈక్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్.. వరుస అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇన్నాళ్లు కామెడి యాంగిల్ చూపించిన శోభన్ సీరియస్ మూడ్‌లో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక ఇందులో సంగీత్ శోభన్ కొంతమందిని పేకాట క్లబ్‌లో పట్టుకుని వారిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయిందని.. నా రూల్స్ మాత్రమే పాటించాలని కండీషన్ పెడతాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతారు. ఇక మిస్టరీ థ్రిల్లర్‌లో సంగీత్ శోభన్ ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా భిన్నమైన లుక్‌లో ఉండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాడు.






