తల్లైన టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. తన బిడ్డ ఫేస్ రివీల్ చేయడంతో అంతా షాక్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

గోవా బ్యూటీ ఇలియానా(Ileana)కు పరిచయం అక్కర్లేదు. రామ్ పోతినేని ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తల్లైన టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. తన బిడ్డ ఫేస్ రివీల్ చేయడంతో అంతా షాక్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: గోవా బ్యూటీ ఇలియానా(Ileana)కు పరిచయం అక్కర్లేదు. రామ్ పోతినేని ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘పోకిరి’ మూవీతో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్ మోహన్ బాబు, రానా దగ్గుబాటి, ఎన్టీఆర్, అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ, ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించింది. అంతేకాకుండా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సడెన్‌గా 2023లో మైఖేల్ డోలన్(Michael Dolan) అనే విదేశీయుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో పాటు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

కొద్ది కాలం పాటు భర్త ఫేస్ కూడీ రివీల్ చేయని ఆ భామ ఆమె అభిమానులు పదే పదే అడుగుతుండటంతో కొడుకు పుట్టిన కొద్ది రోజులకు భర్తను పరిచయం చేసింది. ఇక చివరగా.. ఓ హిందీలో కనిపించింది. ఈక్రమంలోనే తాను రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు వెల్లడించి అందరికీ షాకిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇలియానా రెండోసారి తల్లి అయినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో కొందరు షాక్ అవుతుంటే మరికొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇలియానా స్పందిస్తే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.

Instagram link

Next Story