‘NBK-111’ స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో చిందులేయనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

by Mallepaka Hamsa |

వైవిధ్యమైన పాత్రలతో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోన్న స్టార్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia).

‘NBK-111’ స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో చిందులేయనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన పాత్రలతో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోన్న స్టార్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia). భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ తన గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ పెళ్లి చేసుకోకుండా భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. తాజాగా, తమన్నా భాటియా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా బాలయ్య నటిస్తున్న ‘NBK-111’లో తమన్నాను స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించినట్లు సమాచారం.

ఇందుకు ఆమె కూడా ఒప్పుకోవడంతో మిల్క్‌బ్యూటీని ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు బాలయ్య, తమన్నా డ్యాన్స్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. బాలకృష్ణ(Balakrishna), గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమా ‘NBK-111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య సరసన నయనతార మహారాణి పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్‌ను నవంబర్ 26న ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలు రామానాయుడు స్టూడియోస్‌లో జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Next Story