షూటింగ్‌లో బిజీ అయిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెక్కడున్నారంటే?

by Disha Web Desk 8 |
షూటింగ్‌లో బిజీ అయిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెక్కడున్నారంటే?
X

దిశ, సినిమా : టాలీవుడ్ ఒక్కో మెట్టు ఎదుగుతోంది.ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే కొత వరకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు వరల్డ్ వైడ్ తన స్థానాన్ని చూపెట్టుకుంటుంది. పాన్ ఇండియా లెవల్‌లో మన తెలుగు హీరోస్ తమ ప్రతిభ కనబరుస్తున్నారు.

ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోస్ అందరూ తమ తమ షూటింగ్స్‌తో చాలా బిజీ అయిపోయారు.వీరందరూ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముదుకు రావడానికి రెడీ అవుతున్నారు. కాగా, ఏ హీరో ఏసినిమాతో ఎక్కడెక్కడ ఉండి షూటింగ్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ శర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటీలో జరుగుతోంది. అలాగే నేచురల్ స్టార్ నాని నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ ఓల్డ్ సిటీ నుంచి ఎర్రగడ్డకు షిఫ్ట్ అయింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కితున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దేవర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే రెండు వారాలుగా జరుగుతుంది. ఇక చిరంజీవి కూడా విశ్వంభర మూవీ షూటింగ్ సెట్‌కు వెళ్లినట్లు సమాచారం.ఇలా మన స్టార్ హీరోస్ అందరూ తమ భారీ బడ్జెట్ సినిమాలతో చాలా బిజీ అయిపోయారు.

Next Story