శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్.. షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడుగా!

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కీ రోల్.. షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడుగా!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) గత ఏడాది ‘అమరన్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌: ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. దీపావళి కానుకగా వచ్చి ప్రేక్షకులను కన్నీరు పెట్టేలా చేసి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti).

ఈయన సీనీ కెరీర్‌లో 25వప్రాజెక్ట్‌గా రాబోతుండటం విశేషం. సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల రొమాన్స్ చేయనుంది. ఇందులో జయం రవి,అధర్వ మురళి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్, తిరుచిరాపల్లి నిర్మిస్తున్నారు. షూటింగ్ టకా టకా పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘పరాశక్తి’ మూవీలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీలతో పాటు రానా దగ్గుబాటి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తుండగా.. అభిమానులు కొందరు ఆటోగ్రాఫ్ అడగడంతో ప్రేమగా పలకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన ప్రేక్షకుల్లో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారా? అనే ఆసక్తి పెరిగిపోయింది.

Next Story