‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో.. ఊహించని పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘దసరా’ కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..  ఊహించని పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘దసరా’ కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise). రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్వానిష్, హిందీ భాషల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలవగా.. ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) జాయిన్ అయినట్లు నాని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇందులో ఆయన ‘శికంజ మాలిక్‌’ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘గొప్ప హీరోలు ఉన్నారు... గొప్ప విలన్లు ఉన్నారు. దానిని మోహన్ బాబు మరోసారి గుర్తు చేయడానికి మీ ముందుకు రాబోతున్నారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో కలెక్షన్ కింగ్ షర్ట్ లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ చేతులపై రక్తం కారుతుండగా.. రగ్గడ్ లుక్‌లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఇక అది చూసిన నెటిజన్లు అస్సలు ఊహించలేదు.. లుక్ అదిరింది గురూ అని కామెంట్లు చేస్తూ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు.

Next Story