Post Viral: నాటు కోడికూర, పందాళ్ల కల్లు.. సూపర్ లైఫ్ చిచ్చా

by Gantepaka Srikanth |

టాలీవుడ్ స్టార్ సింగర్(Tollywood Star Singer) రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Post Viral: నాటు కోడికూర, పందాళ్ల కల్లు.. సూపర్ లైఫ్ చిచ్చా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సింగర్(Tollywood Star Singer) రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌(Tollywood)లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నారు. ఆస్కార్ స్టేజీపైనా ప్రదర్శన చేశారు. తాజాగా.. రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. నాటుకోడి కూర(Natu Kodi Kura)తో, పందాళ్ల కల్లు(Kallu)ను ఆస్వాదిస్తూ ఫొటో పెట్టారు. దీనికి ‘కల్లు తాగే అలవాటున్నోళ్లు ఒక లైక్ వేస్కోండి’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. చిన్నప్పుడు కల్లు బాగా తాగే వాడినో బ్రో.. నాకు చాలం ఇష్టం.. కల్లు బాటిల్ ఎత్తితే అయిపోయేవరకూ దించేవాడిని కాదు. బట్ హైదరాబాద్‌కు వచ్చాక మానేయాల్సి వచ్చింది’ అని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్ వ్యక్తి కామెంట్ పెట్టారు. దీనికి రాహుల్ సైతం లైక్ కొట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు.. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్నది. ఇటీవల పవన్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా(Harihara Veeramallu Movie) నుంచి కొల్లగొట్టినాదిరో పాట విడుదలైంది. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) సంగీతం అందించగా, మంగ్లీ(Mangli), రమ్య బెహర(Ramya Behar)తో కలిసి రాహుల్ పాడారు. గతకొన్ని రోజులుగా ఈ పాటకు ఇన్‌స్టాలో రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు.

Next Story