Chalapathi Rao:చలపతిరావు మరణంపై కుమారుడు రవిబాబు రియాక్షన్ ఇదే

by GSrikanth |   (  Updated:2022-12-25 08:29:50  IST  )

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతిపై ఆయన కుమారుడు రవిబాబు స్పందించారు.

Chalapathi Rao:చలపతిరావు మరణంపై కుమారుడు రవిబాబు రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతిపై ఆయన కుమారుడు రవిబాబు స్పందించారు. శనివారం రాత్రి భోజనం చేసే వరకు బాగానే ఉన్నారు. ''పొద్దున్నే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా చెల్లెళ్లు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ల ఇద్దరికీ ఫ్లైట్ దొరకడం ఆలస్యమైంది. వాళ్లు ఇంటికి వచ్చేసరికి మంగళవారం రాత్రి అయ్యే అవకాశం ఉంది. అందుకే అంత్యక్రియలు బుధవారం చేయాలనుకుంటున్నాం. ఐదు రోజుల క్రితం నాన్న ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు'' రవిబాబు తీవ్ర దు:ఖంతో మీడియాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి : తండ్రి చలపతిరావు‌తో రవిబాబు స్పెషల్ వీడియో..

Next Story