టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ చైర్ ఈమె కోసమే ఎదురు చూస్తోందా ?

by Disha Web Desk 10 |
టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ చైర్ ఈమె కోసమే ఎదురు చూస్తోందా ?
X

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే దానిపై గత కొన్ని రోజులు నుంచి చర్చలు నడుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు క్యూలో ఉన్న శ్రీలీల తన సినిమాలతో మెల్లగా కదులుతోంది కాకపోతే ఆమె చేతిలో కొత్త సినిమాలు లేవు. అందుకే నంబర్ వన్‌ స్థానానికి ఆమె అర్హురాలు కాదు. సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోయిన్ల పోటీ మా వల్ల కాదంటూ వెనక్కి తగ్గారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఆ ముద్దుగుమ్మ ఎవరో ఇక్కడ చూద్దాం..

తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఈమె వైపే అందరి చూపు. ఈ ముద్దుగుమ్మ ఆ రేస్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు దూసుకు వస్తుంది.ఆమె ఎవరో కాదు మృణాల్ ఠాకూర్.ఇప్పటి వరకు కేవలం మిడ్ రేంజ్ హీరోలతోనే అమ్మడు నటించింది. కానీ ఇక తనకు నాకు అలాంటి అవసరం లేదని అంటుంది..

ఇప్పటి వరకు ఒక లెక్క .. కానీ ఇకపై ఇంకో లెక్క అంటుంది ఈ ముద్దుగుమ్మ. సీతారామంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నాని సరసన నటించి మరోసారి అందర్ని పలకరించింది. ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాయి. అందుకే ఈ వరుసలో హ్యాట్రిక్ విజయం కోసం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే వరుస విజయాలు అందుకుంటున్న మృణాల్ కి తెలుగు తో పాటు హిందీలో కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ వార్త విన్న ఈమె అభిమానులు టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ చైర్ ఈమె కోసమే ఎదురుచూస్తుదంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Next Story

Most Viewed