Balakrishna: ‘డాకు మహారాజ్’ కోసం రంగంలోకి టాలీవుడ్ మాస్ హీరో.. సినిమాపై హైప్ పెంచుతున్న న్యూస్

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-08 13:45:11  IST  )

నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘NBK109’.

Balakrishna: ‘డాకు మహారాజ్’ కోసం రంగంలోకి టాలీవుడ్ మాస్ హీరో.. సినిమాపై హైప్ పెంచుతున్న న్యూస్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘NBK109’. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దీనికి ఇటీవల ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య పాత్రను మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయబోతున్నారట మేకర్స్. ఇది ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) చిత్రంపై బలమైన ముద్ర వేస్తోందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Next Story