టాలీవుడ్ ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువ.. దుమారం రేపుతున్న ప్రవీణ్ కండ్రేగుల కామెంట్స్!

by Mallepaka Hamsa |

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువ.. దుమారం రేపుతున్న ప్రవీణ్ కండ్రేగుల కామెంట్స్!
X

దిశ, సినిమా: ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’. ఇందులో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. 1980లో జరిగిన కొన్ని సంఘటన ఆధారాంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు, పివిశ్రీధర్ మక్కువ, విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. ఇందులో దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సంగీత కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ఆగస్టు 22న రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో ప్రవీణ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ‘‘తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరం లో సుమారు 250 సినిమాలు రిలీజ్ అయ్యితే, అందులో ఎన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి.

పరదా తర్వాత రిలీజ్ అయ్యే ఘాటి, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ఒక పురుషాదిపత్యం ఎక్కువగా ఉన్న పరిశ్రమ. ఎంత చెప్పినా సరే అందరూ హీరోలనే పొగుడుతారు. ‘పరదా’ సినిమాకు అవార్డులు రాకున్నా పర్లేదు కానీ డబ్బులు రావాలి. మలయాళ చిత్రాలు హిట్ అవడం కాదు.. మన తెలుగు మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంటున్నా. మా సినిమా బాగుంటే స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి దానివల్ల కొందరైనా ‘పరదా’ చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రవీణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ప్రవీణ్ కండ్రేగుల కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Next Story