- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరో భార్య.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరో సుహాస్ (Suhas)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుహాస్ (Suhas)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారాడు. ఇక అప్పటినుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇక ఇటీవల ‘ఓ భామ అయ్యోరామ’ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం సుహాస్ కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మండాడి’ మూవీతో రాబోతున్నారు.
ఇదిలా ఉంటే.. సుహాస్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన లలిత అనే అమ్మాయిని ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి గత ఏడాది జనవరిలో ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లలిత సెప్టెంబర్ 27న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరోసారి తనకు కొడుకు పుట్టాడని వెల్లడిస్తూ హాస్పిటల్‌లో ఉన్న ఫొటో షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సుహాస్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






