Tollywood Heroines: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ భామలు

by Phanindra |   (  Updated:2023-04-03 04:36:22  IST  )

సౌత్లో హీరోయిన్ స్టార్ డమ్ ను నిలుపుకోవడం అంత ఈజీ కాదు.

Tollywood Heroines: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ భామలు
X

దిశ,వెబ్ డెస్క్ : సౌత్లో హీరోయిన్ స్టార్ డమ్ ను నిలుపుకోవడం అంత ఈజీ కాదు. హీరోస్ తో సమానంగా డ్యాన్స్ చేయాలి. అన్నీ రకాల పాత్రలూ చేసే విధంగా ఉండాలి. అవసరం అయితే నెగటివ్ పాత్రలు, ఐటెం సాంగ్ కు కూడా స్టెప్స్ వేస్తూ ఉండాలి. అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. శ్రీ లీల తెలుగులో చేసింది తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఏడు సినిమాల్లో నటిస్తుంది. దీనిలో 5 టాప్ హీరోల సినిమాలే ఉన్నాయి. రెండు సినిమాలు హిట్ అయిన ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. కార్తికేయ 2 సినిమా హిట్‌తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ హిట్‌తో ఆమె రేంజ్ కూడా మారిపోయింది. వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.

Also Read: సమంతను పెళ్లి గెటప్‌లో చూసేసరికి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ్ల పోస్ట్ వైరల్..

Next Story