భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎట్టకేలకు విడాకులపై హింట్ ఇచ్చేసిందిగా?

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-05 15:37:32  IST  )

యంగ్ బ్యూటీ నీతి టేలర్(Niti Taylor) ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎట్టకేలకు విడాకులపై హింట్ ఇచ్చేసిందిగా?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నీతి టేలర్(Niti Taylor) ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తనీష్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో పెళ్లిపుస్తకం, లవ్ డాట్‌కామ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ‘కైసీ యే యారియాన్’(Kaisi Yeh Yaariaan) సీరిస్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పలు పోస్టులతో అమ్మడు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టిందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక నీతి పర్సనల్ విషయానికొస్తే.. 2020లో ఈ బ్యూటీ పరీక్షిత్ భవా(Parikshit Bhava) అనే ఆర్మీ ఆఫీసర్‌ను పెళ్లి(Wedding) చేసుకుంది. కోవిడ్(Covid) సమయంలో వీరి వివాహం కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఆమె నీతి భవాగా పేరు మార్చుకుంది. మూడేళ్ల పాటు వీరి కాపురం బాగానే ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నీతి టేలర్ భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తన పేరులోంచి భవాను తొలగించి మళ్లీ నీతి టేలర్(Niti Taylor) అని ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పెట్టుకుంది. దీంతో భర్తతో విడాకులు(Divorce) అయినట్లు హింట్ ఇచ్చిందని అంతా అంటున్నారు. డైవర్స్ కావడం వల్లే భర్త భర్త ఇంటి పేరును తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించిందనే చర్చ మొదలైంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నీతి అలా చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది.

Also Read..

Jabardasth Ramprasad: జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్! ఔటర్‌పై కారు ప్రమాదం

Next Story