ఏడాదికే మూడో భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. షాకింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ‘గోల్‌మాల్’(Golmaal) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది మీరా వాసుదేవన్(Meera Vasudevan).

ఏడాదికే మూడో భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. షాకింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మోడల్‌గా పరిచయం అయి నటనపై ఆసక్తితో ‘గోల్‌మాల్’(Golmaal) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది మీరా వాసుదేవన్(Meera Vasudevan). ఆ తర్వాత ‘అంజలి ఐలవ్ యూ’ మూవీ చేసినప్పటికీ తెలుగులో పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కెరీర్ పీక్స్‌లో కొనసాగుతుండగా.. 2005లో పెళ్లి చేసుకుంది. అంతా బాగానే ఉందనుకునే క్రమంలోనే విడాకుల తీసుకుని విడిపోయింది. ఐదేళ్ల వరకు కలిసి ఉన్న ఈ జంట మనస్పర్థలు తలెత్తడంతో దూరం అయ్యారు. ఆ తర్వాత 2012లో ఆమె మళ్లీ మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే ఈ జంట కూడా విడిపోయింది.

ఇక 2016లో విడాకులు తీసుకోగా.. పలు సీరియల్స్‌లో నటించింది. ఈ సమయంలోనే కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడిన మీరా 2024లో కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఈ మూడో పెళ్లి కూడా ఆమెకు కలిసి రాలేదు. మూణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. తాజాగా, ఈ విషయాన్ని ప్రకటిస్తూ మీరా వాసుదేవన్ షాకింగ్ పోస్ట్ పెట్టి విడాకులను ప్రకటించింది. ‘‘నేను మీరా వాసుదేవన్.. 2025ఆగస్టులో నా భర్తతో విడాకులు తీసుకున్నాను. ఇక అప్పటినుంచి నేను సింగిల్‌గానే ఉంటున్నాను.

ప్రస్తుతం చాలా అందమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే ప్రజెంట్ ఎలా ఉందో తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం మీరా పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇంకెంత మందిని చేసుకుంటావ్.. ఎంతమంది పురుషుల జీవితాలను నాశనం చేస్తావని తిట్టిపోస్తున్నారు.

Next Story