బడా బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. పోస్ట్‌తో బిగ్ షాకిచ్చిందిగా!

by Mallepaka Hamsa |

తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

బడా బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. పోస్ట్‌తో బిగ్ షాకిచ్చిందిగా!
X

దిశ, సినిమా: తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మెంటల్ మదిలో’(Mental Madhilo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’(Chitralahari) మూవీలో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్శించింది. రెడ్ , కాదల్ పిసాచి వంటి సినిమాల్లో నటించిన నివేదా ‘అలా వైకుంఠపురం’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషలో పలు మూవీస్ చేసిన ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక చివరగా ‘భూ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నివేదా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నివేదా పేతురాజ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతుంది. వినాయక చవితి నాడు ఈ విషయాన్ని ప్రకటిస్తూ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు కాబోయే భర్తతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త రాజహితిబీరన్‌ను పెళ్లి చేసుకోబోతుంది. అయితే వీరిద్దరి వివాహ వేడుక వచ్చే ఏడాదిలో జరగనుండగా.. ఈ వేడుకలకు ఫ్రెండ్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. సడెన్ షాకిచ్చిందిగా అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story