రియాలిటీ షోలో ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అవికా గోర్(Avika Gore) ‘చిన్నారి పెళ్లి కూతురు’సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

రియాలిటీ షోలో ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అవికా గోర్(Avika Gore) ‘చిన్నారి పెళ్లి కూతురు’సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. అలా పలు సినిమాల్లో నటించిన అవికా గోర్ తెలుగు, హిందీ భాషల్లో నటించింది. ఇక గత ఏడాది ‘షణ్ముఖ’ (Shanmukha)మూవీతో ప్రేక్షకులను అలరించింది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న అవికా గోర్ అడపా దడపా సినిమాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. అవికా గోర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలం నుంచి సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త మిలింద్‌(Milind Chadwani)తో ప్రేమలో ఉంది. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ 30న ఈ లవ్ బర్డ్స్ ఓ రియాలిటీ షోలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అవిగా గోర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ఇక ఇందులో ఆమె రెడ్ కలర్ లెహంగాలో ఒంటినిండా నగలు ధరించి కనిపించి మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story