విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. కారణం అదేనా..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-20 02:58:14  IST  )

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన హన్షిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. కారణం అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన హన్షిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘దేశ ముదురు’(Desamuduru) సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో హన్సిక చాలా ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా కందిరీగ(Kandireega), పవర్(Pawar), బిందాస్(Bindas), మస్కా(Maska), బిల్లా(Billa) లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది.

అయితే సడెన్‌గా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జ్‌‌గా వ్యవహరిస్తుంది. అలా తెలుగులో ప్రసారమయ్యే డ్యాన్స్ షో అయినటువంటి ‘ఢీ’(Dhee) షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2022లో సోహైల్ కతురియాను పెళ్లి చేసుకున్నది హన్సిక.

అయితే ఇప్పుడు ఈ చిన్నది తన భర్తతో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తన భర్తకి కూడా గత కొంత కాలంగా ఈ చిన్నది దూరంగా ఉంటూ కేవలం సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఒక్కతే ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. అయితే విడాకుల ప్రచారంలో నిజం లేదని తన భర్త చెప్పినా హన్సిక ఇటీవల సింగిల్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేయడం గమనార్హం. మరి ఈ పుకారుకు హన్సిక ఫుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంది.

Next Story