కొత్త కారు కొన్న టాలీవుడ్ హీరోయిన్.. వైరల్‌గా మారిన ఫొటోలు.. దాని ధర ఎంతో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-01 07:19:33  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (Akanksha Singh)గురించి పరిచయం అక్కర్లేదు.

కొత్త కారు కొన్న  టాలీవుడ్  హీరోయిన్.. వైరల్‌గా మారిన ఫొటోలు.. దాని ధర ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (Akanksha Singh)గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘డాన్ ఔర్ డాక్టర్’(Dan our doctor) చిత్రంతో సినీ పరిశ్రమకు వచ్చింది. ఇక తెలుగులో ఆకాంక్ష సింగ్ అక్కినేని హీరో సుమంత్ సరసన ‘మళ్లీ రావా’ (Malli Raava)సినిమాలో నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో పాటు ఆకాంక్ష సింగ్ నటన, అభినయం, అందానికి బాగానే మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే అక్కినేని నాగార్జున, నాని కాంబోలో వచ్చిన ‘దేవదాస్’ చిత్రంలో అవకాశం అందుకుంది. కానీ విజయం సాధించలేకపోయింది. ఇక తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తున్న ఈ భామ క్రేజీ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

ఇక ఇటీవల ఆకాంక్ష సింగ్ ‘షష్టిపూర్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ప్రభా (Pawan Prabha)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్(Rupesh Chaudhary), అచ్యుత్ కుమార్, ఆనంద చక్రపాణి, చలాకీ చంటీ, మురళీధర్ గౌడ్, సంజయ్ స్వరూప్ కీలక పాత్రలో నటించగా.. దీనిని హీరోగా నటించిన రూపేష్ చౌదరీ నిర్మించాడు. ఈ మూవీకి స్టార్ ఇళయరాజా మ్యూజిక్ అందించారు. అయితే మే 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా అమ్మనాన్న కథతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఆకాంక్ష సింగ్ తన సినిమా ‘షష్టిపూర్తి’ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె ఇటీవల ఓ కారును కొనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు బాలా ఇష్టపడే ఈ ఎలక్ట్రిక్ SVC, XEV 9EV కారును కొనుగోలు చేయగా.. దీని రేటు 21. 90 లక్షల నుంచి 30.50 లక్షల వరకు ఉంటుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Next Story