- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. అతడితో కనిపించడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi) అందరికీ సుపరిచితమే. ‘కోర్టు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi) అందరికీ సుపరిచితమే. ‘కోర్టు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీదేవి, హర్ష రోషన్ జంటగా నటించగా.. ఇందులో ప్రియదర్శి(Priyadarshi),శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ రామ్ జగదీశ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఘన విజయం సాధించడంతో పాటు బాక్సాఫీసను షేక్ చేసింది.
దీంతో ఇందులో నటించిన శ్రీదేవికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఒక్క సినిమాతోనే క్రేజీ బ్యూటీగా మారింది.‘కోర్టు’ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తాజాగా, ఈ అమ్మడు గుడ్ న్యూస్ ప్రకటించింది. తన రెండో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్ నిర్మాత కమ్ నటుడు కెజెఆర్(KJR) నటిస్తున్న రెండు ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ చిత్రాన్ని మిని స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ 15 పేరుతో రాబోతుంది. దీనిని రేగన్ స్టానిస్లాస్(Regan Stanislaus) తెరకెక్కిస్తుండగా.. గిబ్రాన్ సంగీతం అందించనున్నాను. నేడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఆమె లంగాఓణిలో కనిపించగా..కెజెఆర్ పక్కన పూల దండ వేసుకుని ఉంది. ఇక ఈ ఫొటోలను సడెన్‌గా చూసిన నెటిజన్లు శ్రీదేవికి పెళ్లి అయిందనుకొని శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.






