- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) ‘భీమవరం బుల్లోడు’ (Bhimavaram Bulldodu)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) ‘భీమవరం బుల్లోడు’ (Bhimavaram Bulldodu)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, కొంకణి, హిందీ వంటి భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో పెద్దగా గుర్తింపు రాబట్టుకోలేకపోయింది. ఈక్రమంలోనే.. టాలీవుడ్ సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది కాలానికే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన ఎస్తర్ పలు చిత్రాల్లో నటించింది. అలాగే రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా, ఎస్తేర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘క్రైస్తవ మహిళలు వివాహ సమయంలో ధరించే తెల్ల రంగు గౌను ధరించి.. పడవలో వెళ్తూ చేపలతో ఆడుకుంటున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. అలాగే జీవితంలో మరో అందమైన సంవత్సరమని, అవకాశాలు, అద్భుతాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజు నాడు నాపై ప్రేమను, ఆశీర్వాదాలను కురిపిస్తోన్న మీ అందరికీ ధన్యవాదాలు. మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంటున్నాను.. త్వరలోనే అది వస్తుంది, వేచి ఉండండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా క్రిస్టియన్స్ పెళ్లిలో వేసుకునే వైట్ కలర్ ఫ్రాక్ ధరించి చేపలతో ఆడుకుంటున్న ఫొటో షేర్ చేసింది. అయితే ఇందులో కొత్త అనౌన్స్‌మెంట్ అని రాసి ఉండటం గమనార్హం. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఎస్తర్ రెండో పెళ్లి చేసుకోబోతుందని కంగ్రాట్స్ చెబుతున్నారు.






