విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. స్పందించి భర్తతో గొడవ కావడంపై షాకింగ్ కామెంట్స్?

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-29 07:32:17  IST  )

గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. అయితే కొంతమంది జంటలు చిన్న చిన్న కారణాలకే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.

విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. స్పందించి భర్తతో గొడవ కావడంపై షాకింగ్ కామెంట్స్?
X

దిశ, సినిమా: గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. అయితే కొంతమంది జంటలు చిన్న చిన్న కారణాలకే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. అస్సలు అర్ధం చేసుకోకుండా భాగస్వామితో విడిపోతున్నారు. కొంతమంది మరీ దారుణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా భర్తతో గొడవ పడినట్లు విడాకులు తీసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. ఒకప్పుడు ఇండస్ట్రీకి షేక్ చేసి హీరోయిన్ రంభ(Rambha). తెలుగులో చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh), ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), వంటి స్టార్స్‌తో చేసిన ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది.

ఈ ముద్దుగుమ్మ కెనడాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రంభ తన భర్తతో గొడవలు రావడంతో విడాకులు తీసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ టీవీ షోలో పాల్గొన్న రంభ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు నా భర్తతో చిన్న గొడవ జరిగింది. దీంతో బ్యాగ్ సర్దుకుని కెనడా నుంచి చెన్నైకి వచ్చేశాను. అంతేకాకుండా మా ఫ్యామిలీకి గొడవ గురించి మొత్తం చెప్పేశాను.

దీంతో అంతా చాలా కంగారు పడిపోయారు. అలా కెనడా నుంచి వచ్చాక నా కుటుంబంతో కొద్ది రోజులపాటు ఉన్నాను. ఆ తర్వాత నా భర్తతో ఉన్న గొడవలు సర్దుమనిగాయి. మళ్లీ నేను నా భర్త దగ్గరికి వెళ్లిపోయాను. అయితే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్‌లో చిన్న విభేదాలు వస్తుంటాయి. కానీ వాటిని విడాకులు తీసుకునేంత వరకు వెళ్లనివ్వకూడదు. అయితే మేము కూడా అలా చేస్తామని నా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మేము విడిపోలేదు కలిసే ఉన్నాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రంభ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కొంతమంది షాక్ అవుతుండగా.. మరికొందరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More..

పెళ్లి కాకుండానే ఇద్దరు బాబులతో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. ఆ డేట్ అంటూ పోస్ట్


Next Story