- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పరదా’ ట్రైలర్ లాంచ్‌కు గెస్ట్‌గా రాబోతున్న టాలీవుడ్ హీరో.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన అనుపమ
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ అమ్మడు నటిస్తున్న వాటిల్లో ‘పరదా’ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి. శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఆగస్టు 9న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ వేడుక జరనుంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రాబోతున్నట్లు అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.






