Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఇంట విషాదం చోటుచేసుకుంది.

Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయని శ్రీపాదం ఆగ్నేసమ్మ(Agnesamma)(88) సొరవారం అర్ధరాత్రి మరణించాను. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాద్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ పలు అనారోగ్య సమస్యలతో మరణించినట్లు సమాచారం. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చిలో సెమెట్రిలో ఆమె భూస్థాపన నిర్వహించగా.. ఇందులో సందీప్ కిషన్ పాల్గొని నివాళులర్పించారు. అయితే సందీప్ కిషన్ ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు.

ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘నిన్న మేము మా నానమ్మను కోల్పోయాము. మా నాన్న అమ్మ, మా తాత కృష్ణం నాయుడు(Krishnam Naidu) ఒక షిప్ అర్కిటెక్ట్ అండ్ నానమ్మ వైజాగ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పని చేసింది. 1960ల నాటి అంతర్-మత ప్రేమకథ ఒక సినిమా కథ, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత నా తాతగారు జోసెఫ్ కృష్ణం నాయుడు అండ్ గ్రాండ్ మదర్ ఆగ్నెస్ లక్ష్మి చాలా బాగా ఉన్నారు. నిజంగా నాకు తెలిసిన గొప్ప ప్రేమకథ వాళ్లది. మిస్ యూ నానమ్మ.. లవ్ యూ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

Next Story