- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరో శర్వానంద్.. భార్యతో విడాకులే కారణమా?
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ‘ఐదో తారీఖు’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ‘ఐదో తారీఖు’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన ఆయన కొద్ది కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఈక్రమంలోనే రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘మనమే’ అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు ‘శర్వా-36’ చిత్రంలోనూ నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ట్విట్టర్ ద్వారా శర్వానంద్ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇక ఇందులో చాలా బక్కగా కనిపించడంతో అంతా ఆయనకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా? మానసిక వేదనకు గురవుతున్నాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా శర్వానంద్, రక్షిత దూరంగా ఉంటున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ దూరం అయ్యారని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈక్రమంలోనే శర్వా అలాంటి ఫొటోలు పెట్టడంతో భార్య దూరం అయిందని బాధపడుతూ అలా సన్నగా అయ్యాడని అంటున్నారు.






