- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"డ్యూడ్" సినిమాను వదిలేసుకున్న తెలుగు హీరో ?
"డ్యూడ్" సినిమాను కథను మొదటగా అక్కినేని నాగచైతన్యకు దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పినట్లు

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ డ్యూడ్ (Dude). మన దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేయగా మమితా బైజు హీరోయిన్ గా మెరిసింది. ప్రేమ అలాగే పెళ్లి, విడాకుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. హీరో చేసే త్యాగాలు, కామెడీ అందరిని మెప్పించింది. ఈ నేపథ్యంలోనే మొన్న అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ అయి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది డ్యూడ్ సినిమా.
లవ్ టుడే, డ్రాగన్ రెండు సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడు ఈ డ్యూడ్ కూడా రూ.100 కోట్లు దాటింది. అయితే ఇలాంటి బంపర్ హిట్ అందుకున్న సినిమా డ్యూడ్ ను తెలుగు హీరో మిస్ చేసుకున్నాడట. ఈ సినిమా కథను మొదటగా అక్కినేని నాగచైతన్యకు దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కథను రిజెక్ట్ చేశారట అక్కినేని నాగచైతన్య. దీంతో ప్రదీప్ రంగనాథన్ లైన్ లోకి వచ్చి సక్సెస్ అందుకున్నారు.






