సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని బిగ్ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-16 07:31:45  IST  )

సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైలెంట్‌గా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తూ ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని బిగ్ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ..  కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు! (వీడియో)
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైలెంట్‌గా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తూ ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు మాత్రం ప్రేమాయణాన్ని, పెళ్లి సీక్రెట్‌గా ఉంచుతున్నారు. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్, పెళ్లి చేసుకుని ఫొటోలతో షాకిస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి కూడా పెళ్లి చేసుకున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె పసుపు తాడును మెడలో వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

అసలు విషయంలోకి వెళితే.. శ్రీదేవి(Sridevi) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘కోర్టు’ (Court)సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శివాజీ, సాయికుమార్(Saikumar), రోహిణి, విషికా కీర్తి, హర్షవర్ధన్(Harshavardhan) కీలక పాత్రలో నటించారు. రామ్ జగదీష్ తెరకెక్కించిన ఓ లవ్ స్టోరీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో ఇందులో నటించిన శ్రీదేవి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. యూత్‌లో ఫుల్ పాపులారిటీ రాబట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ బాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

ఈనేపథ్యంలో.. తాజాగా, శ్రీదేవికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఆమె మెడలో పసుపు తాడుతో కనిపించడంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందనే వార్తలు జోరందుకున్నాయి. శ్రీదేవి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? పెళ్లి కొడుకు ఎవరా అని తెగ వెతికేస్తున్నారు. అలాగే మరికొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే నిజానికి శ్రీదేవికి పెళ్లి కాలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన వరలక్ష్మి వ్రతం చేసుకోవడంతో పూజ తర్వాత పసుపు తాడుకు లక్ష్మీదేవి కాయిన్ కట్టి మెడలో వేసుకున్నట్లు సమాచారం. కానీ పెళ్లి కాకుండా వేసుకోకూడదని కొందరు అంటున్నారు. ఇక దానిని తాళిబొట్టు అనుకుని శ్రీదేవికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయి పలు పుకార్లు రావడానికి కారణమైంది.

Next Story