‘దండోరా’ మూవీలో వేశ్యగా టాలీవుడ్ బ్యూటీ.. స్పెషల్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-15 04:20:25  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ బిందుమాధవి(Bindu Madhavi) ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. బంపర్ ఆఫర్(Bumper offer), పిల్ల జమిందార్ (Pilla Zamindar)వంటి చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

‘దండోరా’ మూవీలో వేశ్యగా టాలీవుడ్ బ్యూటీ.. స్పెషల్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ బిందుమాధవి(Bindu Madhavi) ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. బంపర్ ఆఫర్(Bumper offer), పిల్ల జమిందార్ (Pilla Zamindar)వంటి చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్‌లోనూ పలు మూవీస్ చేసింది. విభిన్న కథలను ఎంచుకుంటూ విలక్షణ పాత్రలతో తమిళంలో వరుస అవకాశాలు కొట్టేసింది. దీంతో ఫుల్ బిజీ అయిపోయిన బిందు మాధవి మెల్లిగా టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక మళ్లీ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విన్నర్ నిలిచి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘దండోరా’ (Dhandoraa)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మురళీకాంత్(Muralikanth) దర్శకత్వం వహిస్తుండగా.. లైక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు.

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో శివాజీ, నవదీప్, నందు, మణిక, అనూష, రాధ్య, రవికృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇందులో బిందు మాధవి వేశ్యగా నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. నేడు బిందు మాధవి పుట్టినరోజు కావడంతో చిత్రబృందం ఆమెకు విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆమె మిద్దెపై నిల్చొని నడుము చూపిస్తూ స్టిల్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు మూవీ మేకర్స్ ‘‘కొంతమంది ముఖాలు నటించడమే కాదు.. పాత్రలో జీవించేస్తాయి.. మాయ చేస్తాయని’’ క్యాప్షన్ పెట్టారు.

Instagram post about ‘Sri Latha’ for you from the world of Dhandoraa

Next Story