పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యాంకర్ లాస్య

by Dishanational2 |
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యాంకర్ లాస్య
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యాంకర్ లాస్య తమ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. మార్చి7న తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈనేపథ్యంలో లాస్య ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో లాస్య, మంజునాథ్‌తో పాటు వారి తొలి సంతానమైన దక్ష్​ చేతులు ఉన్నాయి. ఒక్కొక్కరు తమ చేతులు ఓపెన్​ చేస్తూ వస్తుంటే ‘ఇట్స్​ ఏ బేబీ బాయ్​’ అనే పదం కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నెటిజన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే లాస్య వీడియోను పోస్ట్ చేస్తూ.. మా జీవితంలో కొత్త ప్రేమను కలుసుకున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

అందాల డాక్టర్.. అందగత్తె కిరీటం

Next Story

Most Viewed