నా భర్తకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్ !

by velandi.Saikiran |   (  Updated:2025-04-03 10:44:23  IST  )

టాలీవుడ్ యాంకర్, స్టార్ నటి అనసూయ భరద్వాజ ( Anasuya Bharadwaja ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గురించి... తన

నా భర్తకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యాంకర్, స్టార్ నటి అనసూయ భరద్వాజ ( Anasuya Bharadwaja ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గురించి... తన కుటుంబం గురించి సీక్రెట్స్ బయటకు చెప్పి.. రచ్చ చేశారు యాంకర్ అనసూయ. తనకు ఆడబిడ్డ కావాలని... అంటుంటే ఇంట్లో మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన భర్తకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఆమె చెప్పకనే చెప్పారు. తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ ( Susank bharadwaj ), తన కుటుంబం లో జరిగే విషయాల గురించి రహస్యాలు ( Secrets) బయటపెట్టారు అనసూయ ( Anasuya ). తన ఇంట్లో ముగ్గురు బీహార్ వాళ్లు ( Bihar ).. ఉన్నారని... అన్ని మీసాలు గడ్డాలు తప్ప ఆడవాళ్లు మాత్రం లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని... తనకు కూడా ఆడపిల్ల కావాలని ఉందని పేర్కొన్నారు అనసూయ. కానీ ఇంట్లో తన ఆటలు సాగడం లేదని వివరించారు.

ఆడపిల్లను కనడం తన చిన్న కొడుకుకు కూడా ఇష్టం లేదని వ్యాఖ్యానించారు అనసూయ. ఇక.. తమ ఇంట్లో ఎక్కువ శాతం బిహారీ పద్ధతులు కొనసాగుతాయని ఆమె వివరించారు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తమ లైఫ్ ఫుల్ బిజీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఫుల్ టైం నటిగా మారిపోయిన తర్వాత... పిల్లలతో గడిపే అవకాశం ఉండడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Next Story