- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెకండ్ మ్యారేజీపై మనసులో మాట బయటపెట్టిన సమంత.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ నుంచి ట్రెండ్ మార్చి ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో నటించిన ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ఎంతటి దుమారాన్ని రేపిందో తెలిసిందే.
ప్రస్తుతం ఆమె అనారోగ్యం బారినపడటంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. రెండో పెళ్లిపై సమంత కీలక వ్యా్ఖ్యలు చేసింది. రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవడం లేదంటూ ఓ నెటిజన్ సమంతను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఇండియాలో మొదటి పెళ్లి కంటే రెండు, మూడో పెళ్లిళ్లకే విడాకుల రేటు ఎక్కువగా ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చింది. అందుకే దానిని లైట్ తీసుకున్నానని, పెద్దగా ఆలోచించడం లేదని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. దేశంలోని విడాకుల గణాంకాలను కూడా ఆమె పోస్టు చేసింది. కాగా, గతంలో సమంత అక్కినేని నాగచైతన్యను లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.






