కొత్త సినిమా ప్రకటించిన తెలంగాణ పోరడు .. కడుపుబ్బా నవ్విస్తున్న టీజర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 14:48:47  IST  )

తెలంగాణ పోరడు తిరువీర్ (Thiruveer)మసూద, పరేషాన్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

కొత్త సినిమా ప్రకటించిన తెలంగాణ పోరడు .. కడుపుబ్బా నవ్విస్తున్న టీజర్
X

దిశ, సినిమా: తెలంగాణ పోరడు తిరువీర్ (Thiruveer)మసూద, పరేషాన్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఫేమస్ డైలాగ్ సమోసా తింటవా శిరీష అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను రాబట్టుకున్నాడు. తెలంగాణ భాషలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా, తిరువీర్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’(The Great Prewedding Show) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీనివాసన్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా..ట్రెండ్‌లో ఉన్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఆధారంగా రాబోతుంది. ఈ మూవీని 7ఎమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సందీప్ అగారం, అస్మిత రెడ్డి బాసాని, కల్పనా రావు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక టీజర్ గమనించినట్లైతే.. హీరో ఓ ఫోటోగ్రఫీ స్టూడియో నడిపిస్తాడు. ఇక ఇందులో బర్త్ డే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటారు. అలా హీరోయిన్‌తో కూడా పరిచయం ఏర్పడుతుంది. ప్రీ వెడ్డింగ్ పట్టుకుని, ముట్టుకుని తీసేది అని అంటాడు. మొత్తానికి టీజర్ జనాలను నవ్విస్తోంది.

Next Story