- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ క్రేజీ హీరో.. ఈసారైనా లక్ కలిసొచ్చేనా?
టాలీవుడ్ హీరో అబ్బాస్ (Abbas)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పని లేదు. ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించిన ఆయన ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అబ్బాస్ (Abbas)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పని లేదు. ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించిన ఆయన ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఆయనను, అబ్బాస్ స్టైల్‌ను ఎంతగానో ఇష్టపడ్డారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన హెయిర్ స్టైల్‌కి అందరూ ఫిదా అయిపోయి.. చాలామంది కూడా సెలూన్‌కు వెళ్లి అబ్బాస్ హెయిర్ స్లైల్ చేయా అన్న అనేవాళ్లు. ఇంత పాపులారిటీ వచ్చినప్పటికీ ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇతర దేశాల్లో సెటిల్ అయ్యాడు. దీంతో ఆయనకు అవకాశాలు రావడం కూడా పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయన అక్కడే ఉండిపోయారు. తాజాగా సమాచారం ప్రకారం.. అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
ఓ తమిళ చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు స్వయంగా డైరెక్టర్ వెల్లడించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అబ్బాస్ ‘హ్యాపీ రాజ్’ (Happy Raj)మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. ‘‘కథలో ఒక పాత్ర ఆయనకు సరిగ్గా సరిపోయేలా ఉంది. మేమే ఆన్‌లైన్‌లో ఆయన కోసం వెతికినప్పుడు న్యూజిలాండ్‌లో ఉన్నారని తెలిసింది. మేము మా ఆసక్తిని తెలియజేయగానే ఆయన వీడియోల్ కాల్ ద్వారా కథ విన్నారు. అది నచ్చడంతో వెంటనే నటించడానికి అంగీకరించారు.
దాని గురించి నిజంగా సంతోషించారు. ఆయన ఇంత దూరం ప్రయాణించి ఈ సినిమాలో నటించినప్పుడు ఆయన అనుభవం నటనలో స్పష్టంగా కనిపించింది. తన నటన ద్వారా మా నిర్ణయం సరైనది అని మాకు ప్రూవ్ చేశారు’’ అని దర్శకుడు మారి ఇలాంచెళియన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు ఈసారైనా లక్ కలిసొస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో జీవీ ప్రకాష్(GV Prakash) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన ఆనంద్ రాజ్ పేరు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.






