Kangana Ranaut: నేడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
Kangana Ranaut: నేడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగనా రనౌత్ పుట్టిన రోజు
X

దిశ, సినిమా: బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అంత ఇంత కాదు. ఏదైనా సరే భయపడకుండా ముక్కు సూటిగా మాట్లాడే ఈ బ్యూటీకి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని భాంబ్లా (సూరజ్పూర్) పట్టణంలో జన్మించింది. అయితే కంగనాకు డాక్టర్‌ కావాలనేది చిన్నప్పటి నుంచి కల. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ముద్దుగుమ్మ అమర్‌దీప్ రనౌత్‌, ఆశా రనౌత్‌లకు మార్చి 23న జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, ఆమె తల్లి ఉపాధ్యాయురాలు. కంగనా పూర్తి పేరు కంగనా అమర్‌దీప్ రనౌత్. అందరూ ఆమెను ముద్దుగా అర్షద్ అని పిలుస్తారు.

గిరజాల జుట్టుతో ఆకర్షణీయంగా కనిపించే జాతీయ అవార్డు విజేత కంగనా రనౌత్ ప్రతి మలుపులోనూ వినూత్నతను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. నిక్కచ్చిగా మాట్లాడటంలో, తప్పులను ఎత్తిచూపడంలో తనకు తానే సాటి అనిపించుకున్న కంగనా.. జనాల మనసును కూడా గెలుచుకుంది.

ఇంత పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ తన కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది. కంగనా హీరోయిన్ అవ్వాలని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులతో బంధాన్ని తెంచుకుంది. తాను హీరోయిన్ కావడం తన తండ్రికి ఇష్టం లేదని పలు మార్లు మీడియాతో కంగనా చెప్పింది. కంగనా 16 ఏళ్ళ వయసులో ఢిల్లీకి చేరుకుంది. అక్కడ ఫ్రాన్స్‌కు చెందిన ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీకి మోడలింగ్ ప్రారంభించింది. అరవింద్ గౌర్ దర్శకత్వం వహించిన అనేక నాటకాల్లో ఆమె నటించింది. నేడు ఈ ముద్దుగుమ్మ తన 37 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Next Story

Most Viewed