Namitha: నేడు అందాల బొద్దుగుమ్మ నమిత పుట్టిన రోజు..!

by Disha Web Desk 9 |
Namitha: నేడు అందాల బొద్దుగుమ్మ నమిత పుట్టిన రోజు..!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నమిత ఆర్యన్ రాజేష్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తర్వాత జెమిని, బిల్లా, సింహా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ అందాల భామ తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తమిళంలో నమిత నటనకు గుడి కట్టేంతలా ఫ్యాన్స్ ఉన్నారు. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోనూ నటించింది. తమిళంలో నమితతో జోడి కట్టని హీరో లేడు. అటు కన్నడ, మలయాళ పరిశ్రమలో కూడా సత్తా చాటింది. ఈ భామ 17 ఏళ్ళ వయసులోనే మిస్ సూరత్ అయింది. కాగా.. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఎక్స్‌క్యూటివ్ మెంబర్‌గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు తన 43 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Read More: 30 ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత



Next Story

Most Viewed