Nayanthara : నేడు స్టార్ హీరోయిన్ నయనతార బర్త్ డే

by Disha Web Desk 9 |
Nayanthara : నేడు స్టార్ హీరోయిన్ నయనతార బర్త్ డే
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. 40ఏళ్లు దగ్గరికి వస్తున్నా.. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తుండటం విశేషం. ఈ భామ కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేయడం ప్రారంభించింది. మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో నయన్‌కు తొలిసారిగా హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘విస్మయతుంబట్టు’, తస్కర వీరన్, రాప్పకల్’ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోలతో నటించింది. తమిళంలో ‘అయ్య, చంద్రముఖి, గజిని సినిమాల్లో నటించింది. తెలుగులో ‘లక్ష్మీ, బాస్, వల్లభ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.

తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాపు చిత్రం శ్రీరామరాజ్యం సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది నయన్. ఈ మూవీకి ‘ఫిల్మ్‌ఫేర్, నంది’ అవార్డులు కూడా దక్కించుకున్నారు. రీసెంట్‌గా షారుఖ్ సరసన జవాన్ చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. అయితే నేడు నయనతార 39 ఏళ్లలోకి అడుగుపెడుతుంది.1984 నవంబరు 18 బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది.

Next Story

Most Viewed