నేడు సీనియర్ నటి జ్యోతిక పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
నేడు సీనియర్ నటి జ్యోతిక పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: సీనియర్ నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు జ్యోతిక సదానా. హీరోయిన్ నగ్మా సొంత చెల్లెలే జ్యోతిక. జ్యోతిక అందంతో పాటు, నటన, నర్తనలోనూ ఆమెకు ఆమే సాటి. తమిళ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ‘డోలీ సజా కే రఖ్నా’ అనే హిందీ సినిమాతో ఆమె తన సినీ కెరీర్‌ ను ప్రారంభించింది.ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న జ్యోతిక 45 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇక తెలుగులో మాస్‌, ఠాగూర్‌ వంటి పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబంధించిన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Next Story

Most Viewed