Allu Arjun: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు

by Disha Web Desk 10 |
Allu Arjun Invited for Grand marshal India Today Parade as chief Guest
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో అల్లు అర్జున్ డ్యాన్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన భిన్నమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నేడు ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు. 1982 ఏప్రిల్ 8న జన్మించారు. ఈయన అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు.

బన్నీ తన 20 ఏళ్ల కెరీర్‌లో నటనతో పాటు ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఎవరికి సాధ్యం కానీ ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్‌లో ఒక్క ఫోటో పోస్ట్‌తో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించిన మొట్ట మొదటి హీరో బన్నీ మాత్రమే. ఇక్కడే తెలుస్తుంది తనకు ఎలాంటి క్రేజ్ ఉందనేది.. ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంటరీ వీడియో తీసిన తొలి హీరో కూడా అల్లు అర్జున్. నేడు తన 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Next Story

Most Viewed