- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐశ్వర్య రాజేష్- తిరువీర్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న ఫస్ట్ లుక్
ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సాధిస్తున్న యంగ్ హీరో తిరువీర్ (Tiruveer)ఇటీవల ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సాధిస్తున్న యంగ్ హీరో తిరువీర్ (Tiruveer)ఇటీవల ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాత్ర ఎంపికలో వినూత్నత చూపిస్తూ, భిన్నమైన కథలను ఎంచుకునే నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. మరోవైపు శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నిలిచే ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి హిట్ కొట్టింది. ఆమెకి ఉన్న పనితనం, రియలిస్టిక్ రోల్‌లో చూపించే ఇమోషన్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇప్పుడు ఈ విజయవంతమైన ఇద్దరు నటులు తొలిసారిగా కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఇటీవల పూర్తైన పూజా కార్యక్రమాల తరువాత ఈ నెలలోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా నదులు–అడవులు సమ్మిళితమైన నేచర్ లొకేషన్స్‌లో షూట్ జరగనుందని సమాచారం. తాజాగా, తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను మూవీ మేకర్స్ ప్రకటించారు.
‘ఓ సుకుమారి’పేరుతో రాబోతున్నట్లు తెలుపుతూ..ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. పోస్టర్‌లో కనిపించిన బ్లూ కలర్ హార్ట్ మధ్య నారింజ రంగు మెరుపు—ప్రేమలో వచ్చే విభేదాలను, ఒత్తిడులను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మర్రిచెట్టును చెరిపేలా పడ్డట్టుగా కనిపించే మెరుపులు, పరిగెత్తుతున్న గ్రామీణులు, వారి వెనకొచ్చే రహస్యమైన బైక్ రైడర్స్‌ను చూస్తే ఇది ఒక థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. పక్కనే కనిపించిన వాగు రొమాంటిక్ విజువల్స్, నేచర్ బ్యూటీ, కథలోని భావోద్వేగ లోతులను సూచిస్తున్నట్లు అనిపిస్తోంది.






