సరికొత్త లుక్.. షాకింగ్ టైటిల్‌.. సల్మాన్ సర్‌ప్రైజ్‌కు ఫ్యాన్స్ ఫిదా

by Dishanational4 |
సరికొత్త లుక్.. షాకింగ్ టైటిల్‌.. సల్మాన్ సర్‌ప్రైజ్‌కు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ న్యూ మూవీకి సంబందించిన టైటిల్‌ అండ్ వీడియో గ్లింప్స్ సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'‌తో వస్తున్న చిత్రానికి ముందుగా 'క‌భీ ఈద్ క‌భీ దివాళీ' అనుకున్నా.. సరికొత్త టైటిల్‌తో సర్‌ప్రైజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఇక వీడియో గ్లింప్స్‌లో స‌ల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ స్టైల్‌ అభిమానుల‌ను ఆకట్టుకుంటుండగా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను ల‌ఢ‌క్‌లో చిత్రీక‌రించగా.. ఈ ఏడాది చివ‌ర‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నట్లు ప్రక‌టించారు.

Next Story

Most Viewed