'Avatar 2' కోసం మళ్లీ జతకట్టిన 'Titanic' జోడి

by Disha Web Desk 17 |
Avatar 2 కోసం మళ్లీ జతకట్టిన Titanic జోడి
X

దిశ, సినిమా: 'టైటానిక్' మూవీ గురించి తెలియని వారంటూ ఉండరు. 1997లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. క్లైమాక్స్‌లో 'టైటానిక్' ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు కామెరూన్. అతని అద్భుత సృష్టికి ఆస్కార్ అవార్డులు సైతం దాసోహం అయ్యాయి. ఇక హీరో హీరోయిన్.. కేట్ విన్స్‌ లెట్, లియోనార్డో డికాప్రియో తమ నటనతో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు.

'టైటానిక్' సినిమా తర్వాత జేమ్స్ కామెరూన్, కేట్ విన్స్‌ లెట్ 'అవతార్-2' మూవీతో మళ్లీ జత కట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేట్, కామెరూన్.. 'టైటానిక్' మూవీ నాటి విషయాలను పంచుకున్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'అవతార్-2' మూవీతో పోల్చితే 'టైటానిక్' షూటింగ్ సమయంలో కేట్ చాలా ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. ఒకానొక సమయంలో తను భయపడింది. 22 ఏళ్ల వయసులో ఆమె 'టైటానిక్' సినిమాలో హీరోయిన్‌గా చేయడం చాలా కష్టమని నేను అనుకున్నా. కానీ, ఆమె గొప్పగా నటించింది' అని చెప్పాడు.

ఇక కేట్ విన్స్‌‌లెట్ మాట్లాడుతూ.. 'కొన్నేళ్ల తర్వాత 'అవతార్-2' కోసం కామెరూన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. 'టైటానిక్' సినిమాతో పోల్చితే ఇప్పుడు తను కూల్‌గా ఉన్నాడు. అప్పట్లో నేను చాలా కోపంగా ఉండేదాన్ని' అంటూ చెప్పుకొచ్చింది.

READ MORE

PK-Sujeeth Film : సినిమా కోసం అకీరా వెయిటింగ్..



Next Story

Most Viewed