తిరువీర్-ఐశ్వర్య కాంబో ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్(Thiruveer) తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

తిరువీర్-ఐశ్వర్య కాంబో ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్(Thiruveer) తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో భరత్ దర్శన్(Bharat Darshan) డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండటం విశేషం. ‘ప్రొడక్షన్ నంబర్-2’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని సమాచారం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని టీమ్ తెలిపారు. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తుండగా.. ఈ నెల 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Next Story