- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవీ ప్రకాష్ కుమార్ ‘బ్లాక్‌మెయిల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూనే మరోవైపు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జీవి ప్రకాష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్లాక్‌మెయిల్’(Blackmail). ఈ మూవీకి మారన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో అరుళ్ నిధి, మహిమా నంబియార్, శ్రీకాంత్, బిందు మాధవి, లింగా, తిలక్ రమేష్, ముత్తు కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
దీనిని JDS ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై జయకోడి అమల్‌రాజ్, ఎ. దేవకని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో జీవీ ప్రకాష్ సరసన తేజు అశ్విని(Teju Ashwini) హీరోయిన్‌గా నటిస్తోంది. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక పోస్టర్ గమనించినట్లైతే.. జీ.వీ. ప్రకాష్ అయోమయంగా, ఆందోళనగా ఉన్నట్టు కనిపించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాడు. అలాగే ఈ పోస్టర్‌లో ఎవ్వరినీ నమ్మొద్దు అని కూడా రాసి ఉండటం గమనార్హం.






