- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో ముగ్గురు టాలీవుడ్ స్టార్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించారు.

దిశ, సినిమా: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు (Suresh Babu)నిర్మించారు. ఇక ఇందులో సుశాంత్ రెడ్డి(Sushant Reddy), వెంకటేష్, కాకమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించారు. అయితే 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ను చిత్రబృందం తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ ఇటీవల ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ‘ఈఎన్ఈ రిపీట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.
‘టీమ్ కన్యా రాశి వచ్చేసింది’ అంటూ పెట్టిన పోస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈచిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో టాలీవుడ్ స్టా్ర్ హీరో నందమూరి బాలకృష్ణ కామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. ఆయన దాదాపు 15 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని టాక్. అయితే ఈ 15 నిమిషాలే సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనతో పాటు మరో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






