సల్మాన్‌కు బెదిరింపులు.. సంచలన విషయాలు వెల్లడించిన లారెన్స్ బిష్ణోయ్

by Disha Web Desk 4 |
సల్మాన్‌కు బెదిరింపులు.. సంచలన విషయాలు వెల్లడించిన లారెన్స్ బిష్ణోయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల అంశంపై లారెన్స్ బిష్ణోయ్ కీలక విషయాలు వెల్లడించాడు. గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ హత్య తమ పనేనంటూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే సిద్ధూ హత్య తర్వాత కొన్ని గంటల్లోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపుతామంటూ ఓ లేఖ ఆయనకు అందడం కలకలం రేపింది. సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్ ను చంపుతామని ఆ లేఖ సారాంశం.

అయితే సల్మాన్ ఖాన్ ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడు. తమ సమాజాన్ని సల్మాన్ ఖాన్ అవమానించాడని, అందుకే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. సల్మాన్ ఖాన్ ను బెదిరించిన సందర్భంలో ఆయన తమకు భారీగా డబ్బులు ఆఫర్ చేశాడని తాము తిరస్కరించామని స్పష్టం చేశాడు. సల్మాన్ ఖాన్ పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉందని, ఆయన మమ్మల్ని అవమానించాడని లారెన్స్ ఫైర్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ అంటే తనకు చిన్నప్పటి నుంచి కోపం ఉందని, ఆయన అహాన్ని అతి త్వరలో దెబ్బతీస్తామని హెచ్చరించాడు. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. మా సమాజం క్షమిస్తే తాను ఏం చేయనని లారెన్స్ తెలిపాడు.



Next Story

Most Viewed