Tamannaah : నటిని అవుతానంటే అందరూ నవ్వుకున్నారు

by Disha Web Desk 10 |
Tamannaah : నటిని అవుతానంటే అందరూ నవ్వుకున్నారు
X

దిశ, సినిమా: స్టార్ నటి తమన్నా తన కెరీర్‌కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను స్కూల్‌లో ఉన్నపుడు ‘నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్?’ అని అడిగారు. వెంటనే యాక్టర్ అని చెప్పేశా. అప్పటి నుంచి స్కూల్‌లో అందరూ నాతో అదోలా ప్రవర్తించేవారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తూ చిన్న చూపు చూసేవారు. కానీ, నేను వాటిని పట్టించుకోలేదు. చదువుకుంటూ, షూటింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వచ్చా. ఒక్కసారి బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలో కమర్షియల్ యాడ్‌లో నటించాల్సి వచ్చింది. అది ఇబ్బందిగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more:

అప్పుడే నా మనసు ముక్కలైపోయింది: బాలీవుడ్ నటి



Next Story

Most Viewed