- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చండాలమైన పనులు చేసే వాళ్ళు సమాజంలో హ్యాపీగా బతకేస్తున్నారు.. దుమారం రేపుతున్న రేణు దేశాయ్ పోస్ట్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాకు పరిమితం అయింది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. జంతు ప్రేమికురాలైన రేణు దేశాయ్ ఇటీవల తన కూతురు ఆద్య పేరుతో ఓ పెట్ షెల్టర్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నో మూగ జీవాలను ఏమ్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. వాటిపై జరుగుతున్న దాడులను సైతం అడ్డుకుంటుంది. అలా చేసే వారిపై పలు చర్యలు తీసుకుంటుంది. పర్యావర పరిరక్షణ, హిందూ ధర్మం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాల్లో ఆమె చురుకుగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అది కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
‘‘ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని వీధి కుక్కలను అన్నింటినీ చంపేయడం ఎంత న్యాయం. అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్ చేసినవాళ్లు మాత్రం మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇదెక్కడి న్యాయం. రేపిస్టులు, దొంగలు చెత్త వ్యక్తు, స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రజలు ఏం అనిపించడం లేదు . అలాంటి వారి మధ్యనే తిరుగుతున్నారు. కానీ మూగా జీవాలు ఉన్నాయని పిల్లలను వీధుల్లోకి తీసుకురావడానికి భయమేస్తుందని అంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. అలాగే వీధి కుక్కల ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం మనుషులు, కుక్కలు ఒకటేనా ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? అని మండిపడుతున్నారు.






