- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పదిహేను రోజులు సవాలుగా అనిపించింది.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘నా స్వామి రంగ’ సినిమాతో హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘నా స్వామి రంగ’ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’మూవీలో విలన్‌గా కనిపించనున్నారు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ‘కూలీ’(coolie) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఖైదీ, విక్రమ్ నాకు లోకేష్‌కు ఇష్టమైన రెండు సినిమాలు. నేను ‘కూలీ’ స్క్రిప్ట్ విన్నప్పుడు, అది చాలా ఆసక్తికరంగా ఉంది.
స్టోరీ మొత్తం విన్న తర్వాత నేను నేను విలన్‌గా నటించడానికి రజినీకాంత్ సార్ అంగీకరించారా? అని అడిగాను. ఎందుకంటే నా పాత్ర చాలా బలంగా ఉంది. రజనీ సార్‌తో సమానంగా ఉంది. బ్యాంకాక్‌లో మేము 15 రోజులు ఓడలో షూటింగ్ చేశాము. మొత్తం షూటింగ్ చాలా సవాలుగా ఉంది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, రజనీకాంత్ సార్ 350 మంది సభ్యులందరికీ డబ్బు ఇచ్చి వారి కుటుంబాలకు ఏదైనా కొనమని చెప్పారు. వైజాగ్‌లో నా ఫస్ట్ షూట్ జరిగింది. రెండో రోజు కూడా జరగడంతో ఆ వీడియోలు రికార్డు చేసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిసింది. అది తెలుసుకున్న తర్వాత మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో ‘కూలీ’ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి.






