ఆ చేదు జ్ఞాపకాలు, విషాద సంఘటనలు నా జీవితాన్నే మార్చేశాయి.. ఆ బాధ వర్ణనాతీతం: ఎన్టీఆర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-09 06:22:00  IST  )

ఆ చేదు జ్ఞాపకాలు, విషాద సంఘటనలు నా జీవితాన్నే మార్చేశాయి. ఆ బాధ వర్ణనాతీతం’’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

ఆ చేదు జ్ఞాపకాలు, విషాద సంఘటనలు నా జీవితాన్నే మార్చేశాయి.. ఆ బాధ వర్ణనాతీతం: ఎన్టీఆర్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన జీవితంలోని అత్యంత విషాదకరమైన సంఘటనలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబంలో జరిగిన తీరని లోటు గురించి ప్రస్తావిస్తూ, అభిమానుల క్షేమం కోరి ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి నందమూరి హరికృష్ణ, అలాగే అన్నయ్య జానకిరామ్ ఇద్దరినీ రోడ్డు ప్రమాదాల్లోనే కోల్పోయిన విషయాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘‘నా తండ్రిని, అన్నయ్యను రోడ్డు ప్రమాదాల రూపంలో కోల్పోయాను. ఆ చేదు జ్ఞాపకాలు, విషాద సంఘటనలు నా జీవితాన్నే మార్చేశాయి. ఆ బాధ వర్ణనాతీతం’’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆయన కోరుకున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తారక్ కోరారు. ‘‘దయచేసి బండి నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ కోసం వేచి చూస్తుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు మీ భార్యాపిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. అలా ఆలోచిస్తే మీరు ఆటోమేటిక్‌గా సురక్షితంగా డ్రైవ్ చేస్తారు’’ అని హితవు పలికారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

జీవితంలో సక్సెస్ అవ్వాలనుకునే యువతకు కూడా ఎన్టీఆర్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ‘విజయానికి సత్వరమార్గాలు ఎప్పుడూ ఉండవు. కేవలం కష్టపడటం, పని పట్ల అంకితభావం కలిగి ఉండటం మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి’ అని చెప్పారు. ఒక నటుడిగా తాను ఈ స్థాయికి రావడానికి పడిన శ్రమను ఆయన పరోక్షంగా గుర్తుచేసుకున్నారు. తారక్ చెప్పిన ఈ మాటలు అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తారక్ చెప్పింది అక్షర సత్యం.. నిజమైన బాధ్యత గల హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కామెంట్స్‌తో అనసూయ మైండ్ బ్లాక్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

Next Story